Monday, December 9, 2024

మన ఊరి పండుగలో భాగస్వాములు కావాలి… కరుణాకర్ రెడ్డి

తిరుపతి సిటీ, ఏప్రిల్ 25 (ప్రభ న్యూస్): మన ఊరి పండుగలో నగర ప్రజలంతా భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయం వద్ద మంగళవారం గంగ జాతర పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. గంగ జాతరను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఇటీవల ప్రభుత్వమే నిర్ణయించడం జరిగిందని వివరించారు. నగరంలో ఎటు చూసినా విస్తృతంగా నగరంలో హోల్డింగులు, పోస్టర్లు, స్టిక్కర్లతో పాటు వచ్చేనెలలో జరగనున్న గంగ జాతరను అందరిని భాగస్వాములతో నిర్వహించేందుకు ఇప్పటినుంచి అన్ని రకాల ఏర్పాట్లను చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు.

భక్తుల సంఖ్యను మరింత పెంచే విధంగా ప్రచారం చేయడంతో పాటు 50వేలకు పైగా పత్రికలు తిరుపతి సమీప ప్రాంతాల్లో విస్తృతంగా పంపిణీ చేసే ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. గంగ జాతరలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. భక్తుల కల్పవల్లి అయిన గంగమ్మ తల్లి జాతర అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాల తరహాలో నిర్వహించాలనే తలంపుతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పండుగ ప్రకటించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, గంగమ్మ గుడి ఆలయ చైర్మన్ కట్టా గోపి యాదవ్, ఈవో మునికృష్ణయ్య, తిరుపతి కోపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ తొండం నాటి వెంకటేశ్వర్ రెడ్డి, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement