Wednesday, March 29, 2023

వ్యూహకర్తలే ఊపిరి..

అమరావతి, ఆంధ్రప్రభ: ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. అధికారంలొ ఉన్న వైసీపీతో పాటు- ప్రతిపక్ష తెలుగుదేశం కూడా రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, ప్రజల ఆలోచనా తీరుపై ఎప్పటికప్పు డు సర్వేలు చేయించి నివేదికలు తెప్పించుకుంటు-న్నాయి. తాము ఏయే అంశాల్లో బలంగా ఉన్నాం.. ఏయే అంశాల్లో బలహీనంగా ఉన్నాం.. పరిష్కారానికి ఎటు-వంటి చర్యలు చేపట్టాలి అనే విషయంపై రెండు పార్టీలకు ఎన్నికల స్ట్రాటజిస్టు లు సలహాలు, సూచనలు
అందజేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నేతల పనితీరు, స్థానిక పరిస్థితులు ఇలా పలు అంశాల్లో రాజకీయ సలహాదారులతో పాటు వివిధ సర్వే సంస్ధలతో రాజకీయ పార్టీలు నిర్వహిస్తున్న సర్వేల ప్రకారమే ఆయా పార్టీల అధినేతలు నిర్ణయం తీసుకుంటున్నారు. దీంతో ఎప్పటికప్పుడు పరిస్థితులపై వారికి సమగ్ర సమాచారం అందుతుండటంతో నేతలు కూడా కొంత జాగ్రత్తతో ఉంటున్నారు. ఈనేపథ్యంలో వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో ఎవరికివారే గెలుపుపై ధీమా వ్యక్తంచేస్తున్నారు. మొత్తంగా చూస్తే రాజకీయ స్ట్రాటజిస్టులు చెప్పిందే రాజకీయ పార్టీలకు శాసనంగా మారుతోంది.

వైసీపీకి నెలకో నివేదిక
అధికార వైఎస్సార్సీపీకి రాజకీయ సలహాదారుగా ఐప్యాక్‌ పనిచేస్తోంది. ప్రతి నెలకు ఒకసారి సర్వే నిర్వహించి నివేదికను అందజేస్తోంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్‌ వేర్వేరు మార్గాల్లో కూడా సర్వేలు చేయించి నివేదికలు తెప్పించుకు న్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఐప్యాక్‌ రూపొందించినదే. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను మార్చాలా? లేదా? అక్కడి పరిస్థితి ఏమిటి? ప్రత్యర్థి పార్టీ పరిస్థితి ఏమిటి? తదితరాలన్నింటినీ నియోజకవర్గాలవారీగా వైసీపీ అధిష్టానానికి ఐప్యాక్‌ అందజేస్తోంది. ఈక్రమంలోనే పార్టీ మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతోనే గృహ సారథుల కాన్‌సెప్ట్‌ను కూడా తీసుకొచ్చింది. అది పూర్తికాగానే వారికి రాజకీయ శిక్షణా తరగతులను ఏర్పాటు చేయబోతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమేమి అందుతున్నాయి..అర్హత ఉన్నా అందని పరిస్థితి ఉందా..అనే అంశాన్ని క్షేత్రస్థాయి నుండే సీఎం జగన్‌ తెలుసుకునే వెసులుబాటు కలుగుతోంది. దీంతో ఐప్యాక్‌ చెప్పిన ప్రతి పనిని సీఎం జగన్‌ తూ.చ.తప్పకుకుండా పాటిస్తున్నారు.

- Advertisement -
   

సీనియర్లొద్దంటున్న రాబిన్‌
తెలుగుదేశం పార్టీకి రాజకీయ సలహాదారుగా ఉన్న రాబిన్‌ శర్మ బాదుడే బాదుడు, ఇదేంఖర్మ కార్యక్రమాలను రూపొందించారు. వీటికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వ్యక్తమవడంతో ఆయనపై చంద్రబాబు మరింత నమ్మకాన్ని పెంచుకున్నారు. నారా లోకేష్‌ పాదయాత్ర కూడా రాబిన్‌ శర్మ సూచనల మేరకే జరుగుతోందని తెలుగు తమ్ముళ్లు చెబు తున్నారు. తాజాగా రాబిన్‌ శర్మ టీ-ం తెలుగుదేశం పార్టీలోని సీనియర్‌ నాయకులపై సర్వే నిర్వహించి నివేదికను అందజేసిం ది. పార్టీకి తెల్ల ఏనుగులా మారినవారిని వదిలించుకోవాలని, అలాంటివారివల్ల పార్టీకి ఎటు-వంటి ప్రయోజనం ఉండదని సూచించినట్లు- తెలుస్తోంది.
వారు చెప్పిందే వేదం
రానున్నది ఎన్నికల కాలం కావడంతో వైసీపీ తరఫున ఐప్యాక్‌ చెప్పిందే వేదం కాబోతోంది. టీడీపీలో రాబిన్‌ శర్మ టీ-ం చెప్పిందే శాసనంగా మారబోతోంది. మున్ముందు మరికొన్ని సంస్థల చేత ఇరు పార్టీలు సర్వేలు నిర్వహింపచేసుకొని క్రాస్‌ చెక్‌ చేసుకోబోతున్నాయి. వైసీపీ తరఫున ప్రజాప్రతినిధులంతా గడప గడపకు మన ప్రభుత్వంద్వారా ప్రజల చెంతకు వెళుతున్నారు. మరోవైపు నారా లోకేష్‌ యువగళం పేరుతో పాదయాత్ర ద్వారా ప్రజల చెంతకు వెళుతున్నారు. ఇంకోవైపు జనసేనాని పవన్‌ కల్యాణ్‌ తన వారాహి వాహనంద్వారా ప్రజల చెంత కు చేరువయ్యేందుకు ఏర్పాట్లు- చేసుకుంటు-న్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్‌ బస్సు యాత్ర చేపట్టే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబు తున్నాయి. పార్టీ ఏదైనప్పటికీ, కార్యక్రమం ఏదైనప్పటికీ అందరి లక్ష్యం ప్రజల మనసులు గెలుచుకోవడమే. ఓటరన్న ఎవరిని ఆశీర్వదిస్తాడో చూడాలి మరి.

Advertisement

తాజా వార్తలు

Advertisement