Thursday, April 25, 2024

అఖండ శతదినోత్సవ వేడుకలు.. పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనం

కర్నూల్: గత ఏడాది రిలీజ్ అయిన అఖండ మూవీ శ‌త దినోత్స‌వ వేడుక‌లు నిర్వ‌హించారు. సినీ నటుడు, ఎమ్మెల్యే బాలయ్య బాబు యాక్షన్ సీన్స్, బోయపాటి మేకింగ్, తమన్ బీజీఎం అన్ని కలిపి ‘అఖండ’ సినిమాని బ్లాక్ బస్టర్ గా నిలిపాయి. కలెక్షన్స్ కూడా భారీగా వచ్చాయి. ‘అఖండ’ సినిమాతో బాలకృష్ణ-బోయపాటి హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ఈ క్రమంలో ‘అఖండ’ సినిమా శత దినోత్సవ వేడుకల్ని కర్నూలు నగరంలోని ఎస్ టి బి సి కళాశాలలో శనివారం సాయంత్రం నిర్వ‌హించింది.

‘అఖండ’ సినిమా శత దినోత్సవ వేడుకలకు నటుడు బాలకృష్ణతో పాటు, అఖండ యూనిట్ సభ్యులు హాజరయ్యారు. ఈ వేడుకలను తిలకించేందుకు ఎస్టి బిసి కళాశాలకు పెద్ద ఎత్తున బాలకృష్ణ అభిమానులతోపాటు, టీడీపీ శ్రేణులు హాజరయ్యారు. దీంతో వేడుకలకు హాజరైన జనాన్ని కంట్రోల్ చేయడంలో పోలీసులు చేతులెత్తేశారు. ఓ దశలో మీడియా సభ్యులతోపాటు సాధారణ జనంపై పోలీసులు చిందులు తొక్కుతూ కనిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement