Monday, March 25, 2024

ఆహా.. ఏపీలో రోడ్డు ప‌నులంటే అధికారుల‌కు పండుగే, ఇగో ఇట్లుంట‌ది మ‌న‌తోని!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్ల‌పై గుంతల విష‌యంలో ఈ మ‌ధ్య కాలంలో చాలామంది కామెంట్స్ చేస్తుంటే, మంత్రులు మాత్రం అట్లేం కాదు.. వ‌చ్చి చూసి తెలుసుకోండి అంటూ స‌ముదాయించుకుంటున్నారు. కానీ, అక్క‌డి రోడ్ల ప‌రిస్థితి క‌ళ్ల‌తో చూసిన వారు మాత్రం ఇంత ఘోరంగా రోడ్లుంట‌యా, జ‌ర్నీ చేయాలంటే న‌డ్డి విరిగిపోతోంద‌ని నెత్తి, నోరు కొట్టుకుంటున్నారు. దీనికి చినజీయ‌ర్ స్వామే ప్ర‌త్య‌క్ష సాక్షిగా చెప్పుకోవ‌చ్చు.

ఇక‌.. రోడ్ల‌కు రిపేర్ల పేరిట అధికారులు, కాంట్రాక్ట‌ర్ల‌లో చిత్త‌శుద్ధి లేద‌న‌డానికి ఈ రోడ్డును చూస్తేనే తెలిసిపోతోంది. ఎందుకంటే.. నిన్న రాత్రి హ‌డావుడిగా వేసిన ప్యాచ్ వ‌ర్క్‌తో తెల్లారేస‌రికి మ‌ళ్లీ య‌థావిధిగా అయ్యింది. చేసిన ప‌ని స‌క్క‌గ లేక‌పోవ‌డంతో తెల్లారేస‌రికి మ‌ళ్లీ గుంత‌లు తేలిందంటున్నారు ప్రయాణికులు. గుంటూరు నుంచి ప్రత్తిపాడు మీదగా ఒంగోలు వెళ్లే పాత మద్రాస్ రోడ్డులో నిన్న (శుక్ర‌వారం రాత్రి) ప‌నులు చేప‌ట్టారు. ప్రత్తిపాడు మండలం బొర్రావారిపాలెం దగ్గర రోడ్డు గుంతలు పడిన చోట‌ రాత్రి ప్యాచ్ వర్క్ చేశారు. అలా వేసిన రోడ్డు నాణ్యత లోపం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఎందుకంటే.. ఉదయం వెళ్లే ట్రాఫిక్ తో ఆ పూడ్చడానికి వేసిన రోడ్డు అచ్చులుగా లేచిపోయింది. ఇలాంటి పరిస్థితులుకు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల చేతివాటమే కార‌ణ‌మంటున్నారు ఆ రోడ్డుపై జ‌ర్నీ చేస్తున్న వారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement