Saturday, March 25, 2023

2024 తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతు.. మంత్రి మేరుగ

2024 తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతవుతుందని ఏపీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు పై ఆయన ఫైర్ అయ్యారు. జగనన్న కాలనీలను పరిశీలించే అర్హత పవన్ కు లేదన్నారు. జగనన్న కాలనీల ద్వారా ఎవరు లబ్ది పొందుతున్నారో పవన్ కల్యాణ్ తెలుసుకుని మాట్లాడాలన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు కొల్లగొట్టారన్నారు. కేసీఆర్ అన్నట్లు కేంద్రానికి అనుకూలంగా వ్యవహరించడం లేదన్నారు. రాష్ట్రం డెవలప్ మెంట్, ప్రజా సంక్షేమమే తమకు ముఖ్యమన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement