Friday, April 19, 2024

జనసేనలో చేరికలు.. నాదెండ్ల సమక్షంలో కండువా కప్పుకున్న నేతలు

అమరావతి, ఆంధ్రప్రభ: జనసేన పార్టీలో చేరికలు పెరుగుతున్నాయి. ఈ నెల 14న పార్టీ ఆవిర్భావ సభ నేపథ్యంలో జిల్లాల్లో నిర్వహిస్తున్న సమావేశాల్లో పలు పార్టీల నుంచి స్థానిక నేతలు జనసేన కండువా కప్పుకొంటున్నారు. తాజాగా శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ- ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ సమక్షంలో పలువురు నాయకులు చేరారు. తూర్పు గోదావరి జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం డైరెక్టర్‌, రాజమహేంద్రవరం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ డైరెక్టర్లు అల్లంకి నాగేశ్వరావు, కోటంశెట్టి సత్యనారాయణ, సలాది సుబ్రమణ్యం, రెడీమేడ్స్‌ వర్తక సంఘం వైస్‌ ప్రెసిడెంట్‌ వడగన వీరభద్రరావు, బోగిరెడ్డి బాబ్జి, సప్పా శ్రీనివాసరావులతో పాటు- మరికొందరు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. పార్టీ రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధ్యక్షులు వై. శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వీరంతా జనసేన కండువా కప్పుకొన్నారు. వీరందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన మనోహర్‌ అంతా కలసికట్టు-గా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఏసీ సభ్యులు పంతం నానాజీ పాల్గొన్నారు.

ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీ-ల్లో మరికొందరి నియామకం
మంగళగిరి నియోజకవర్గం, ఇప్పటం గ్రామంలో ఈ నెల 14న నిర్వహించనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహణ కోసం 12 కమిటీ-లను నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీ-ల్లో మరికొందరి నియామకానికి పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ ఆమోదం తెలిపారు.

కొత్తగా చేర్చిన సభ్యుల వివరాలు
జిల్లాల సమన్వయ కమిటీ-లో నూకల నారాయణరావు, భోగిరెడ్డి కొండల రావు, సంగిశెట్టి అశోక్‌, వాసిరెడ్డి శివ, తలాటం సత్య, ఆకుల మణికుమార్‌, ఆహ్వాన కమిటీ-లో మల్లినీడి తిరుమలరావు(బాబీ), క్యాటరింగ్‌ కమిటీ-లో పీవీఎస్‌ఎన్‌ రాజు, మెడికల్‌ అసిస్టెన్స్‌ కమిటీ-లో డా. క్రిస్టాపరపు సతీష్‌, మీడియా కో ఆర్డినేషన్‌ కమిటీ-లో ఆకుల కిరణ్‌ కుమార్‌, బొలిశెట్టి వంశీకృష్ణ, తిరుమలశెట్టి నరేష్‌, పులిగడ్డ నాగేశ్వరరావు, బాదర్ల శివనాగకుమార్‌, ఇంజరపు సూర్య, పబ్లిసిటీ- కమిటీ-లో గాదె వెంకటేశ్వరరావు, సెక్యూరిటీ- కమిటీ-లో ఆర్‌డీఎస్‌ ప్రసాద్‌, మేకల తేజ, వినయ్‌, మేడిద శ్రీను, కొండా చిన్ని, కె. సాయి సూర్య, పెదమళ్లు మణికం, వి. సతీష్‌ కుమార్‌, శివప్రసాద్‌ రెడ్డి, ఏడిద భార్గవ్‌, బేతు చైతన్య కృష్ణ, వాలంటీ-ర్ల కమిటీలో గుండా జయప్రకాశ్‌ నాయుడు, నల్లగోపుల చలపతిరావు, ఆనంద్‌ సాగర్‌లను నియమిస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement