Saturday, December 7, 2024

Breaking: ఏపీ సీఎం జగన్‌కు సీనియర్ నటుడు కైకాల లేఖ

ఏపీ సీఎం జగన్‌కు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ లేఖ రాశారు. అనారోగ్య సమయంలో తన కుటుంబానికి అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు కైకాల వెల్లడించారు.

గతేడాది నవంబర్‏లో తీవ్ర అనారోగ్యంతో కైకాల సత్యనారాయణ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడ ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తి స్థాయిలో మెరుగుపడింది. పూర్తిగా కోలుకున్న కైకాల ఏపీ సీఎం జగన్‏కు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు. తన అనారోగ్య సమయంలో కుటుంబానికి అండగా నిలిచిన అందరికీ ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. తాను ఆసుపత్రిలో ఉన్న సమయంలో తనకు అందించిన అమూల్యమైన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా కాల్ చేసి, ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందిస్తామని హామీ ఇవ్వడం ద్వారా మీరు చూపిన శ్రద్ధకు పట్ల నేను చాలా సంతోషిస్తున్నానని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement