Wednesday, February 8, 2023

న‌టుడు చిరంజీవి కాంగ్రెస్ లోనే ఉన్నారు.. గిడుగు రుద్రరాజు

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఒంట‌రిగానే అసెంబ్లీ..లోక్ స‌భ‌కు పోటీ చేస్తుంద‌న్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్రరాజు అన్నారు. కాగా మెగాస్టార్ చిరంజీవి ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నారని, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు. తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని అన్నారు. ఎన్నికల కోసం జిల్లా కమిటీలు, నాయకులను సిద్ధం చేసేందుకు జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఏపీలో సీఎం జ‌గ‌న్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అత్యాచారాలు, అక్రమాలు పెరిగిపోయాని ఆరోపించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement