Thursday, November 14, 2024

Accident | క‌ర్నూలు జిల్లాలో ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి

ఆంధ్ర‌ప్ర‌భ , క‌ర్నూలు బ్యూరో : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన ఆలూరు మండల పరిధిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఘటనలో మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లా ఆలూరు మండలం, కరిడి గడ్డం వద్ద ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై వస్తుండగా బైక్ ప్రమాదవశాత్తు స్కిడ్ కావడంతో యువకులు గాయపడ్డారు. వారిని ఆలూరు ఆసుపత్రుకి తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. మృతులు కర్ణాటకకు చెందిన వారుగా గుర్తించారు.

- Advertisement -

కర్ణాటక రాష్ట్రం , బళ్ళారి జిల్లా, తగ్గినబూదళ్ళి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు బైక్ పై కర్నూలు జిల్లా, ఆలూరు మండలం, దేవరగట్టులో జరిగే బన్నీ ఉత్సవం తిలకించే నిమిత్తం తమ గ్రామం నుంచి బైక్ పై వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు. వీరు కరిడి గుడ్డం నుండి అరికెర మార్గం మద్యలో బైక్ ప్రమాదం కు గురైనట్లుగా గుర్తించారు. ఘటనలో తగ్గిన బూదళ్ళి గ్రామానికి చెందిన హరీష్ (23), మల్లికార్జున (23) రవి తీవ్రంగా గాయపడ్డారు.

వారిని వైద్య చికిత్స నిమిత్తం ఆలూరు ఆసుపత్రికి తరలించగా హరీష్, మల్లికార్జున మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు.కాగా రవి అనే యువకుడికి తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మెరుగైన చికిత్స అంది స్తున్నారు. అవసరమైన పక్షంలో వారిని ఆదోని ఆసుపత్రికి తరలించే అవకాశం వుంది. ఈ ఘటన పై పోలీసులు ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించడంతో పాటు ప్రమాదం జరిగినతీరును పరి శీలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement