Friday, October 4, 2024

AP: నంద్యాలలో యువకుడు దారుణహత్య…

నంద్యాల బ్యూరో, సెప్టెంబర్ 30 (ప్రభ న్యూస్) : జిల్లా కేంద్రమైన నంద్యాల పట్టణంలో అర్ధరాత్రి ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన జరిగింది. స్థానిక గుడిపాటిగడ్డలో ఉప్పరిపేట నివాసి మనోహర్ ను ఇవాళ‌ తెల్లవారుజామున దారుణంగా కొట్టి, కత్తితో పొడవడంతో అక్కడికక్కడే మరణించాడని పోలీసులు తెలుపుతున్నారు.

అనంతరం నిందితుడు దుర్గాప్రసాద్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమా ?.. లేక మరి ఏదైనా నా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement