Wednesday, December 11, 2024

AP | రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి…

నంద్యాల జిల్లా పరిధిలోని కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడుమృతి చెందాడు. కొత్తపల్లి మండలం నందికుంట గ్రామానికి చెందిన మాయలూరి శ్రీనివాసులు (32) అనే యువకుడు ఆత్మకూరు మండల పరిధిలోని కరివెన గ్రామ సమీపంలో రాత్రి పనికి వెళ్లి ఆత్మకూరు వైపు తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ రామాంజి నాయక్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement