Thursday, November 7, 2024

AP | రైలు కిందపడి యువ‌కుడి ఆత్మహత్య…

నంద్యాల బ్యూరో : నంద్యాల జిల్లా కేంద్రంలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని సలీంనగర్ చెందిన ఆటో డ్రైవ‌ర్ ఫరూక్ మంగళవారం మధ్యాహ్నం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు… గుంటూరు నుంచి వచ్చే రైలు ప్లాట్ ఫారం మీదికి ఆగటానికి వస్తున్న సమయంలో పట్టాలపైకి దూకాడు. క్షణాల్లో ఆ రైలు అతనిపై నుంచి దూసుకెళ్లింది. దీంతో రెండు కాళ్లు తెగిపడ్డాయి. ప్లాట్ ఫామ్ పైనే పది నిమిషాల పాటు చూపుతో పోరాడి మృతిచెందాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు పోలీసుల దర్యాప్తులో తేల్చునున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement