Friday, April 19, 2024

చంద్ర‌బాబుకు ఘ‌న స్వాగ‌తం

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలోని గోమతి సర్కిల్ వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తిరుపతి నుంచి నెల్లూరుకు రోడ్డుమార్గాన వెళ్తున్న చంద్రబాబుకు టీడీపీ మండల అధ్యక్షుడు సంచి కృష్ణయ్య, టీడీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు కందమూడి శివకుమార్, మండల ప్రధాన కార్యదర్శి దేవారెడ్డి నాగేంద్రప్రసాద్ రెడ్డి, నాయకులు దామెర ప్రసాద్ నాయుడు, గంగాబత్తిన రామకృష్ణ, వేలూరు హరిబాబు రెడ్డి, కలవకోలు మునీష్, పాలచ్చురు నరేంద్ర, గంగాబత్తిన శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement