Friday, November 29, 2024

AP | సీ ప్లేన్ స‌ర్వీస్ తో ఏపీలో కొత్త శ‌కం.. రామ్మోహ‌న్ నాయుడు

  • కొన్ని నిమిషాల వ్య‌వ‌ధిలోనే శ్రీశైలంకు చేరిక‌
  • అతి త‌క్కువ, ఖ‌ర్చు.. అందుబాటులో శీఘ్ర‌ద‌ర్శ‌నం
  • మ‌రో నాలుగు నెల‌ల్లో పూర్తి స్థాయిలో స‌ర్వీస్ అందుబాటు
  • వెల్ల‌డించిన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడు


విజ‌య‌వాడ – దేశంలోనే సీ ప్లేన్ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రారంభిస్తున్నామ‌ని, ఇది మ‌న రాష్ట్రానికి ఎంతో శుభ సూచ‌క‌మ‌ని అన్నారు కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి కింజార‌పు రామ్మోహన్ నాయుడు. కొన్ని మార్గదర్శకాలు మార్చి సామాన్యులకు అందుబాటు ధరలో ఉండేట్లు స్కీం ను రూపొందిస్తున్నామ‌న్నారు.

విజయవాడ-శ్రీశైలం మధ్య సీ ప్లేన్ ట్రయల్‌ రన్ ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చేతుల మీదుగా ఇవాళ‌ విజ‌య‌వాడ‌లోని కృష్ణాన‌ది తీరంలో లాంచ‌నంగా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర‌మంత్రి మాట్లాడుతూ… ఎయిర్ పోర్ట్ కట్టాలంటే కనీసం 500ఎకరాల అవసరమ‌ని అంటూ… అంత స్థ‌లం లేకుండా వాటర్ ఏరో డ్రోమ్స్ సహాయంతో ఎయిర్ ట్రావెల్ కు అవకాశం ఉందన్నారు.. ఉడాన్ స్కీం ద్వారా వయబిలిటీ గ్యాప్ ఫండ్ కూడా ఉంద‌ని.. టూరిజం కూడా సహకరిస్తే ఇంకా వేగంగా ముందుకు వెళ్తాం అన్నారు.

ఇక, ప్రస్తుతానికి విజయవాడ – శ్రీశైలంతో పాటు విజయవాడ – నాగార్జున సాగర్, విజయవాడ – హైదరాబాద్‌ రూట్‌లు కన్ఫర్మ్ అయ్యాయి అని వెల్లడించారు రామ్మోహన్‌ నాయుడు.. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తీర ప్రాంతంలో రాజధాని అమరావతికి కనెక్ట్ చేసే విధంగా మరిన్ని స్టేషన్ లు అభివృద్ధి చేస్తామ‌న్నారు.. రెగ్యులర్ ట్రావెల్ కు మరో మూడు నాలుగు నెలల సమయం పడుతుందన్నారు.. అయితే, ప్రస్తుతం ఇది ట్రయిల్ మాత్రమేన‌ని,.. ధరలు, ట్రిప్ ల వివరాలకు మరింత సమయం పట్టే అవకాశం ఉందన్నారు..

- Advertisement -

సీ ప్లేన్ ఆపరేషన్స్ కు కేవలం రాష్ట్రాన్నే కాదు దేశ గతినే మార్చే శక్తి ఉందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. చంద్రబాబు సూచన మేరకే పాలసీలో కొన్ని మార్పులు చేసి అందుబాటులోకి తెచ్చామ‌న్నారు. .. చంద్రుడు మన ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నిత్య పున్నమి ఉంటుందని పున్నమి ఘాట్ సాక్షిగా చెబుతున్నా అంటూ సీఎం చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు.. అతి చిన్న దేశం మాల్దీవుస్ లో సీ ప్లేన్ ద్వారా చాలా ఆదాయం వస్తుంద‌ని అంటూ .. అలాంటిది 140 కోట్ల జనం, 1350 దీవులు ఉన్న భారతదేశంలో సీ ప్లేన్ ఆపరేషన్స్ ఒక విప్లవం కానున్నాయన్నారు.. అందుకు అమరావతినే మొదటి వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి.

సీ ప్లేన్ స‌ర్వీస్ ల‌తో ఆర్ధికాభివృద్ధి – మంత్రి బీసీ జ‌నార్ధ‌న్ రెడ్డి

సీ ప్లేన్ సేవలు ప్రాంతీయ అనుబంధాలను మరింత పెంచుతాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. సీ ప్లేన్ కార్యకలాపాల కోసం 8ప్రాంతాలు ఇప్పటికే గుర్తించినట్లు తెలిపారు. రహదారులు భవనాల శాఖకు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక తిరిగి ప్రోత్సహకం లభిస్తోందని తెలిపారు. ఆర్ధిక వృద్ధి, పర్యాటకాభివృద్ధికి విమానాశ్రయాలు పెంచుతున్నామని వివరించారు. గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల నిర్మాణం ద్వారా ఎయిర్ కనెక్ట్విటీ పెంచుతున్నామని చెప్పారు. కుప్పం, దగదర్తి, పుటపర్తిలో కొత్త విమానాశ్రయాల అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement