Thursday, November 14, 2024

AP: ముచ్చుమర్రి బాలిక కుటుంబానికి రూ.10ల‌క్షల చెక్కు అందజేత

నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో మైనర్ బాలిక అదృశ్యం కేసు నేపథ్యంలో శుక్రవారం బాధితుల ఇంటి వద్ద మంత్రులు పరామర్శించి, ప్రభుత్వం తరపున రూ.10 లక్షల చెక్కును అందజేశారు.

రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బాధిత కుటుంబానికి చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా, నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే గిత్త జయసూర్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement