Wednesday, April 24, 2024

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై కేసు న‌మోదు ..?

టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై న‌గ‌రంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను స్వామి వివేకానందుడితో పోలుస్తూ మంగళవారం వర్మ వరుస ట్వీట్లు చేశాడు. వివేకానందుడిని ఆదర్శంగా తీసుకునే భారతీయులకు, యువకుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వర్మ పోస్టులున్నాయంటూ ఏబీవీపీ విద్యార్థులు వర్మపై కేసు పెట్టారు. నిత్యం ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ భారతీయ సంస్కృతిపై దాడి చేయడం వర్మకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే కాపులపై ట్విట్టర్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలని ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతు రామ్మోహనరావు మంగళవారం విజ‌య‌వాడ‌ పటమట పోలీస్ స్టేషన్‌లో సీఐ కాశీ విశ్వనాథ్‌కు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement