Thursday, June 1, 2023

లీకేజీ కేసులో ఎవరున్నా వదలం: నారాయణ అరెస్ట్ పై బొత్స కామెంట్

పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణను అరెస్ట్ చేసిన వ్యవహారంపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఎవరున్నా అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. తప్పు ఎవరు చేసినా వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రశ్నపత్రం ఎక్కడ లీకైందో అధికారులు విచారణ చేస్తున్నారని తెలిపారు. అరెస్టయిన వాళ్లు తప్పు చేయలేదని నిరూపించుకోవాలని పేర్కొన్నారు. అక్రమాలు జరగకుండానే ఎందుకు అరెస్ట్ చేస్తామని ప్రశ్నించారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఇప్పటిదాకా 60 మందిని అరెస్ట్ చేశామని మంత్రి బొత్స తెలిపారు.

కాగా, మాజీ మంత్రి నారాయ‌ణ‌ను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. హైద‌రాబాద్ కొండాపూర్‌లోని నారాయ‌ణ నివాసానికి మంగ‌ళ‌వారం ఉద‌యం ఏపీ సీఐడీ పోలీసులు వ‌చ్చారు. అనంత‌రం ఆయ‌న‌ను అదుపులోకి తీసుకుని ఏపీకి త‌ర‌లించారు. పేపర్ లీకేజీ వ్యవహారంలోనే ఆయనను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement