Saturday, May 28, 2022

Breaking: కృష్ణా జిల్లాలో విషాదం.. మున్నేరు వాగులో ఐదుగురు చిన్నారులు గల్లంతు

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏలూరు గ్రామంలో విషాదం నెలకొంది. ఈత కోసం మున్నేరు వాగులో వెళ్లిన ఐదుగురు చిన్నారులు గల్లంతైయ్యారు. గల్లంతైన విద్యార్థులు బాల యేసు, చరణ్, అజయ్, సన్నీ, రాకేష్ గా గుర్తించారు. చిన్నారులంతా 12 సంవత్సరాల లోపు వారే ఉన్నారు. ఇంటి నుంచి వెళ్లిన చిన్నారులు రాత్రి అవుతున్నా ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. వారి కోసం వెతికారు.ఈ క్రమంలో మున్నేరు ఒడ్డున వారి దుస్తులు కనిపించాయి. దీంతో స్నానాల కోసం వాగులో దిగి గల్లంతై ఉంటారని భావిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు.. మున్నేరు వాగు వద్దకు చేరుకుని గాలింపు చర్యలను పర్యవేక్షించారు. రంగంలోకి దిగిన ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నలుగురు మృతదేహాలను వెలికితీశాయి. బాల యేసు, చరణ్, అజయ్, సన్నీలుగా గుర్తించారు. రాకేష్ మృతదేహం కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. చిన్నారుల మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement