Thursday, March 28, 2024

హాస్టళ్లలో నాడు-నేడుకు రూ.3,364కోట్లు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం జగన్..

రూ.3,364కోట్లతో హాస్టళ్లలో నాడు-నేడుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంగన్‌వాడీలు, సంక్షేమ హాస్టళ్లపై సీఎం జగన్ సమీక్షించారు. ఇందుకోసం తొలి విడత కింద రూ.1500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అంగన్‌వాడీల్లో నాడు-నేడుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ గతంలో ఇచ్చిన ఆదేశాల అమలు ప్రగతిని అధికారులు వివరించారు.

పిల్లలకు మంచి మౌలిక సదుపాయాలతో పాటు కిచెన్ల ఆధునీకరించనున్నట్లు వెల్లడించారు. మన పిల్లలే అక్కడకి వెళ్తారనుకుంటే ఎలాంటి వాతావరణం ఉండాలని కోరుకుంటామో అవన్నీ కూడా అంగన్‌వాడీలలో ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. అంగన్‌వాడీలలో టాయిలెట్ల నిర్వహణ, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలన్నారు. ఈ మేరకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పారు. అనంతరం గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో నాడు – నేడుపై సీఎం సమీక్షించారు. మొత్తం మూడు దశల్లో ఈ కార్యక్రమం చేపట్టాలని… హాస్టళ్లలో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారాలన్నారు. హాస్టళ్లలోకి వెళ్లేసరికి జైల్లోకి వెళ్లిన భావం పిల్లలకు ఉండకూడదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement