Thursday, April 25, 2024

Followup: ఒకే రోజు 3,300కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. న‌ర‌సాపురం చ‌రిత్ర‌లో కొత్త అధ్యాయం

ఏలూరు ప్రభన్యూస్‌ బ్యూరో : ఒకే రోజు రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయడం నరసాపురం చరిత్రలోనే సరికొత్త అధ్యాయమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ప్రపంచ మత్స్య దినోత్సవ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఏర్పాటు చేసిన పలు అభివృధ్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు- చేసిన సభలో సీఎం జగన్‌మోహనరెడ్డి ప్రసంగిస్తూ, ఆక్వా ఉత్పత్తులు, ఎగుమతులలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. ఏపీలో ఆక్వా విశ్వ విద్యాలయంతో మరింత మెరుగైన అవకాశాసున్నాయని ఆయన తెలిపారు.

ఫిషరీస్‌లో డిప్లొమా నుంచి డిగ్రీ, పీజీ, పి.హెచ్‌.డి వరకూ ఈ యూనివర్సిటీ-లో అందుబాటు-లోకి తెస్తామని ఆయన స్పష్టం చేశారు. దేశంలో కేవలం తమిళనాడు, కేరళ తర్వాత మూడో యూనివర్సిటీ- ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రారంభిస్తున్నామన్నారు. -టె-ండర్లు పూర్తయ్యాయిని, నేటినుండి పనులకు శ్రీకారం చుడతున్నట్లు చెప్పారు. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఓఎన్‌జీసీ తవ్వకాల్లో జీవనోపాధి దెబ్బతిన్న 23 వేల మందికి రూ.107 కోట్ల 90 లక్షలు పరిహారం నగదు బదిలీ చేశారు. దర్బ éరేవులో ఆక్వా కంపెనీ భూముల 1600 మంది సాగుదారులకు పట్టాలు పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా ముఖ్యమంత్రికి భారీ మత్స్య ఆకృతి రూపాన్ని ఇచ్చి, కిరీటం పెట్టి మత్స్యకారులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖామంత్రి సిదిలి అప్పలరాజు , రాష్ట్ర మంత్రులు కొట్టు- సత్యనారాయణ కారుమూరి వెంకటనాగేశ్వరరావు. హోంమంత్రి తానేటివనిత శాసనమండలి చైర్మన్‌ కొయ్య మోషన్‌ రాజు స్థానిక శాసనసభ్యులు ముదునూరి ప్రసాద్‌ రాజు అధికారులు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement