Thursday, March 28, 2024

తీర ప్రాంతంలో 27 అక్వా ల్యాబ్స్..

అమరావతి, : నకిలీ విత్తనాలు, మేతతో పాటు- ఇతర ఇతర నాసిరకం ఆక్వా ఉత్పత్తులను పూర్తిగా కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆక్వా ఉత్పత్తుల విదేశీ ఎగుమతుల్లో ఏపీ ప్రథమస్థానం దక్కించుకునే దిశగా పరుగులు పెడుతున్న నేపథ్యంలో రొయ్యలు, చేపల ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుం టోంది. ఇప్పటికే ఆక్వా డెవలప్‌ మెంట్‌ అధారిటీ-ని నెలకొ ల్పిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రే-టె-డ్‌ ఆక్వా ల్యాబు లను ఏర్పాటు- చేస్తోంది. ఇవి వైఎస్సార్‌ అగ్రి ల్యాబులకు అనుసంధానంగా పనిచేయనున్నాయి. ఇప్పటికే ఉత్తరాంధ్ర లోని విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు- ఏలూరు, కాకినాడ, -కై-కలూరు, ఒంగోలు, నెల్లూరుల్లో ఆక్వా ల్యాబులు ఉన్నప్పటికీ వాటిలో సాంకేతిక సదుపా యాలు తక్కువగా ఉన్నాయి. గతంలో ఎప్పుడో కొనుగోలు చేసిన అనేక సాంకేతిక పరికరాలు పాడయిపోయాయి. కాకినాడలోని స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ -టె-క్నాలజీ (ఎస్‌ఐఎఫ్‌టీ-) పర్యవేక్షణలో పనిచేస్తున్న ఆ ల్యాబులను పూర్తిగా ఆధునీకరించటంతో పాటు- రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 27 ఇంటిగ్రే-టె-డ్‌ ఆక్వా ల్యాబుల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆక్వా సాగు ఎక్కువగా ఉన్న తీర ప్రాంతాల్లో చేపట్టిన వీటి నిర్మాణం శరవేగంగా కొనసాగు తోంది. దీని కోసం తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రూ 50.30 కోట్లను విడుదల చేసింది. దీనిలో రూ 20 కోట్లను ఆధునిక సాంకేతిక పరికరాల కోసం వినియోగిస్తుండగా మిగతా రూ 30.30 కోట్లను భవన నిర్మాణాల కోసం వ్యయం చేస్తున్నారు. ఈ నెలాఖరుకు కొన్ని ల్యాబులు అందుబాటు-లోకి రానుం డగా సెప్టెంబరు చివరి నాటికి ల్యాబులన్నీ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ ల్యాబుల్లో సీడ్‌, ఫీడ్‌ క్వాలిటీ- పరీక్షలతో పాటు- మట్టి, నీటి నమూనా పరీక్షలు, పిసిఆర్‌, మైక్రో బయాలజీ -టె-స్టులు చేయను న్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 7, ఆ తరు వాత పశ్చిమ గోదావరిలో 6 ల్యాబులు అందుబాటు-లోకి రానున్నాయి. శ్రీకాకుళంలో 5, ప్రకాశంలో మూడు, విజయనగరంలో ఒకటి, కృష్ణా జిల్లాలో 5, నెల్లూరులో రెండు ల్యాబులు సేవలందించనున్నాయి. ఆక్వా సీడ్‌, ఫీడ్‌ ను ల్యాబుల్లో పరీక్షించాకే మార్కెట్లో అమ్మాల్సి ఉంటు-ంది. దీంతో ఆక్వా రంగాన్ని పట్టి పీడిస్తున్న నకిలీలను పూర్తిస్థా యిలో కట్టడి చేసేందుకు అవకాశం ఉంటు-ంది..అగ్రి ల్యాబు లు నిర్మిస్తున్న భవన సముదాయాల్లోని ఒక అంతస్తును ఆక్వా ల్యాబుకు కేటాయిస్తున్నందున రైతులకు అందుబాటు-లో ఉండటమే కాకుండా బహుళ ప్రయోజనాలు చేకూరు తాయని సాగుదారులు, అధికారులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement