Sunday, October 1, 2023

Tirupati: 240కిలోల గంజాయి సీజ్…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని తిరుప‌తి జిల్లా సూళ్లూరుపేటలో భారీగా గంజాయి ప‌ట్టుబ‌డింది. 240 కిలోల గంజాయిని పోలీసులు సోమవారం సీజ్ చేశారు. గంజాయిని తరలించేందుకు బొలెరో వాహనంలో మార్పులు చేర్పులు చేయించారు. పుష్ప సినిమాలో మాదిరిగా నిందితులు బొలెరో వాహనంలో మార్పులు చేయించారు.

- Advertisement -
   

బొలెరో వాహనంలో టమాటల కింద ఏర్పాటు చేసిన ప్రత్యేక అరలో గంజాయిని తరలిస్తున్నారు. బొలోరే వాహనంలో గంజాయి తరలిస్తున్న విషయమై పోలీసులకు కచ్చితమైన సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో బొలెరో వాహనంలో గంజాయిని పోలీసులు గుర్తించారు. గంజాయిని తరలిస్తున్న నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు తమిళనాడు రాష్ట్రానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement