Saturday, December 4, 2021

గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్

ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఇచ్చాపురం పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ ఎస్సైకి అందిన పక్కా సమాచారంతో సరిహద్దు వద్ద వీరిని అదుపులోకి తీసుకున్నారు. పర్లాకిమిడికి చెందిన ఇద్దరు వ్యక్తులు బరంపురం నుంచి గంజాయిను తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పురుషోత్తపురం చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. ఇద్దరు వ్యక్తులు టివిఎస్ ఎక్సల్  వాహనంపై వస్తుండగా వారి వద్ద నుండి 2.24 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒడిశాలోని గజపతి జిల్లా కేంద్రమైన పర్లాకిమిడి పట్టణంలోని పెద్ద బ్రాహ్మణవీధికి చెందిన అశోక్ కుమార్, చట్టి భీమశంకర్ లుగా తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News