Tuesday, April 23, 2024

Omicron variant: కర్నూలుకు పాకిన ఒమిక్రాన్.. డోన్ లో దంపతులకు వైరస్

ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్ కేసులు విజృంభిస్తున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలోని డోన్‌లో ఒమిక్రాన్ కలకలం రేగింది. బుధవారం ఓ ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ దంపతులకు ఒమిక్రాన్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దుబాయ్‌లో బంధువుల దగ్గరకు వెళ్లొచ్చిన దంపతులకు పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులో ఒమిక్రాన్‌గా నిర్ధారణ కాగా..  బాధితులను క్వారంటైన్‌కు తరలించారు.

రాష్ట్రంలో మొత్తం 10 ఓమిక్రాన్ కేసులు నమోదు కాగా,  ఇందులో కర్నూలు జిల్లా చేరిపోవడం గమనార్హం. ఈ విషయంపై జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ రామ గిడ్డయ్య ఆంధ్రప్రభతో మాట్లాడుతూ.. ఓమిక్రాన్ సోకిన దంపదతులను వయసు 45 ఏళ్లు ఉంటాయని అన్నారు. బాధితులను డోన్ లో ఓ ప్రైవేట్ స్కూల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఇటీవల దుబాయ్ కి వెళ్లి వచ్చిన వీరిద్దరూ ఈనెల 20వ తేదీన డోన్ పట్టణానికి చేరుకున్నారు. వచ్చిన తర్వాత జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండగా వారికి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 23న కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో వారికి పాజిటివ్ అని తేలడంతో వారితో పాటు వారిని కలిసిన బంధువులను, వారు నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాల  సిబ్బంది  నుండి నమూనాలను సేకరించారు.  అయితే ఈ దంపతులకు ఈ నెల 26న కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిందని వైద్య అధికారి తెలిపారు.  వైరాలజీ ల్యాబ్‌ రిపోర్ట్ మేరకు ఇద్దరికి ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఒమిక్రాన్ బారిన పడ్డ దంపతులను వారి ఇళ్ల వద్ద హోం ఐసోలేషన్‌లో ఉంచినట్లు ఆయన తెలిపారు. 

ఒమిక్రాన్ పాజిటివ్ దుబాయ్ రిటర్నీలతో పాటు జిల్లాలో ఇప్పటివరకు విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చిన  1200 మందిని గుర్తించినట్లు ఆయన తెలిపారు. వీరందరి వద్ద నుంచి నమూనాలు సేకరించి నున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రామ గిడ్డయ్య వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement