Sunday, October 17, 2021

విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

విజయనగరం జిల్లా బొండపల్లి సమీపంలో సిద్దార్ధ కాలేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి..ఇద్దరికి తీవ్ర గాయాలైయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News