Thursday, March 28, 2024

Breaking: కర్నూలు ఎంపీని మోసం చేసిన కేసులో ఇద్దరు అరెస్టు

కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్‌ను‌ ఆన్ లైన్‌ లో మోసం చేసిన కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు జార్ఖండ్ వాసులుగా గుర్తించారు. అయితే, కీలక సూత్రధారి మాత్రం పరారీలో ఉన్నాడు. పది రోజుల క్రితం కర్నూలు ఎంపీ సంజీవకుమార్‌కు పాన్‌ కార్డు అప్‌డేట్‌ చేసుకోవాలని ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఓ అపరిచిత వ్యక్తి ఫోన్‌ చేసి ఓటీపీ తదితర వివరాలు తీసుకున్నాడు. ఆ వెంటనే ఎంపీ అకౌంట్‌లో నుంచి రూ.97 వేల నగదు డ్రా అయింది. దీంతో తాను మోసపోయానని గుర్తించిన ఎంపీ కర్నూలు టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎంపీ సంజీవకుమార్‌కు వచ్చిన ఫోన్‌ కాల్స్‌, నగదు జమ అయిన బ్యాంకు అకౌంట్‌ తదితర వివరాలతో నిందితులు జార్ఖండ్‌లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఓ ప్రత్యేక బృందాన్ని జార్ఖండ్‌కు పంపారు. అక్కడికి వెళ్లిన ఈ బృందం నిందితులు కమలేష్‌, నరేష్‌ అనే ఇద్దరు వ్యక్తులను కర్నూలుకు తీసుకువచ్చినట్లు తెలిసింది. ప్రధాన సూత్రధారి పరారీలో ఉన్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement