Thursday, April 25, 2024

Breaking: స్కూల్లో కరోనా కలవరం.. 17 పాజిటివ్ కేసులు

ప్రకాశం జిల్లాలో ఒకే రోజు స్కూళ్లలో 17 పాజిటివ్‌ కేసులు నమోదు కావటం ఆందోళనకు కలిగిస్తోంది. కోవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో తెలంగాణలో జనవరి చివరి వరకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. కానీ ఏపీలో మాత్రం పండుగ తరువాత కూడా స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో ఏపీలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి.

ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఒకే రోజు స్కూళ్లలో 17 పాజిటివ్‌ కేసులు వెలుగు చూడడం ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలో మంగళవారం (జనవరి 18) ఒక్కరోజే 17 మంది సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కోవిడ్ సోకినవారిలో 15 మంది ఉపాధ్యాయులతో పాటు ఇద్దరు సిబ్బందికి కోవిడ్‌ సోకింది.
ఒంగోలు డీఆర్ఎం, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, అద్దంకి మండలం తిమ్మాయపాలెం, చిన్నగంజాం జెడ్పీ హైస్కూల్‌లో ఇద్దరికి కరోనా సోకింది. ఒంగోలు కేంద్రీయ విద్యాలయ, మార్కాపురం శారదా ఎయిడెడ్ స్కూల్, కనిగిరి నందన మారెళ్ల, సింగరాయకొండ మండలం కలికివాయి, టంగుటూరు మండలం కొణిజేడు, పంగులూరు మండలం రేణిగంవరం, సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం, యద్దనపూడి మండలం యనమదల, గన్నవరం ఎంపీపీఎస్ స్కూళ్లలో ఒక్కక్కరికి టీచర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. త్రిపురాంతకం మండలం మేడపి, యద్దనపూడి మండలం పూనూరు స్కూళ్లలో బోధనేతర సిబ్బందికి కోవిడ్‌ సోకింది.
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న క్రమంలో ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు పాటించాలరని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement