Wednesday, April 24, 2024

కొప్పర్తిలో 1000 కోట్లతో టెక్స్‌టైల్స్‌ పార్కు, పదివేల మందికి ఉపాధి.. పరిశీలించిన‌ కేంద్రం బృందం

కడప, ప్రభన్యూస్‌ బ్యూరో: వైఎస్‌ఆర్‌ (కడప) జిల్లా కొప్పర్తి మెగా ఇండస్ట్రీయల్‌ పార్కులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నేతృత్వంలో భారీ టెక్స్‌టైల్స్‌ పార్కు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకోసం స్థల పరిశీలన చేసేందుకు శనివారం కేంద్ర ప్రభుత్వ ఇంటిగ్రేటేడ్‌ టెక్స్‌ టైల్స్‌ రీజియన్‌ అండ్‌ అప్పెరల్‌ బృందం శనివారం కొప్పర్తి పారిశ్రామిక వాడలో స్థల పరిశీలన చేసింది. 6700 ఎకరాలలో ఏర్పాటైన కొప్పర్తి ఇండస్ట్రీయల్‌ పార్కులోని నార్త్‌ బ్లాక్‌ లో గల జగనన్న మెగా ఇండస్ట్రీయల్‌ హబ్‌ లో ఈ టెక్స్‌టైల్స్‌ పార్కు ఏర్పాటు చేసేందుకు ప్రతినిధుల బృందం పరిశీల న చేసింది. రాష్ట్ర పరిశ్రమల సలహాదారుడు రాజోలి వీరారెడ్డి, ఏపిఐఐసి జోనల్‌ మేనేజర్‌ శ్రీనివాస మూర్తిలు ఇక్కడి స్థలాలను చూపించడంతో పాటు ఎయిర్‌ పోర్టు, రైల్వే సౌకర్యం, నేషనల్‌ హైవే కనెక్టివిటీ, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్‌ లాంటి మౌళిక సదుపాయాలు చూపించారు.

వీటిని పరిశీలించిన కేంద్ర బృందం ఇక్కడ టెక్స్‌ టైల్స్‌ పార్కు ఏర్పాటు చేసేందుకు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇటీవల రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడులశాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలనన్‌ పి.యం. మిత్ర క్రింద కొప్పర్తిలో టెక్స్‌ టైల్స్‌ పార్కు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు ఈనెల 4వ తేదిన ఢిల్లిలో జరిగిన సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రధాన కార్యదర్శి కరికాల వలనన్‌ , ఏపిఐఐసి మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుబ్రమణ ్యం జువాది దీనికి సంబంధించి ప్రజెంటేషన్‌ ఇవ్వడం జరిగింది. దీంతో సెంట్రల్‌ మినిస్ట్రీ ఆఫ్‌ టెక్స్‌ టైల్స్‌ ఇక్కడికి కేంద్ర బృందాన్ని పంపడం జరిగింది. కొప్పర్తిలో రూ.1000 కోట్ల పెట్టుబడితో 1186 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే సంకల్పంతో వున్న ఈ పరిశ్రమలో ప్రత్యక్షంగా , పరోక్షంగా పదివేల మందికి ఉపాధి కల్పించనున్నారు. ఈ పరిశ్రమ 30 శాతం కేంద్రప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్‌ టెక్స్‌ శాఖ గ్రాంట్‌ ద్వారా మరో 70శాతం ఆంధ్రప్రదేవ్‌ పరిశ్రమల అభివృద్ది మౌలిక సదుపాయాల కల్పన శాఖ ద్వారా ఏర్పాటు చేస్తున్నట్లు పరిశ్ర మలశాఖ రాష్ట్ర పరిశీలకులు రాజోలి వీరెడ్డి తెలిపారు. కొప్పర్తిలో పరిశీలన చేసిన కేంద్ర బృందంలో డైరెక్టర్‌ మినిస్ట్రీ ఆఫ్‌ టెక్‌ ్స టౖౖెల్స్‌ హెచ్‌.కె.నంద, డిప్యూటి సెక్రటరీ పుర్నేడు కాంత్‌తో పాటు జిల్లా పరిశ్రమలశాఖ జనరల్‌ మేనేజరు విజయలక్ష్మిలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement