Thursday, March 28, 2024

సిటీ బాట పట్టిన జనం.. ఊళ్లకు పోయినోళ్లు తిరిగొస్తున్నరు

ప్రభన్యూస్‌, హైదరాబాద్‌ : దసరా పండుగకు తమ సొంత గ్రామాలకు వెళ్లిన వారు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కావడంతో జాతీయ రహదారులపై రద్దీ పెరిగింది. తెలంగాణలో అత్యంత పెద్ద పండుగైన దసరాకు వారం ముందుగానే తమ సొంతూళ్లకు వెెళ్లిన ప్రజలు.. వేడుకలు ముగియడంతో తిరుగు ప్రయాణమయ్యారు. సెలవులు ముగియడం విద్యా సంస్థలు ప్రారంభం కానుండటంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలకు వెళ్లే వారు ముందుగానే హైదరాబాద్‌కు బయలుదేరడంతో జాతీయ రహదారులపై రద్దీ పెరిగింది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌ మండలం పంతంగా టోల్‌ప్లాజాతో పాటు బీబీనగర్‌ మండలం గూడూరు టోల్‌ ఫ్లాజాలు వాహనాల రద్దీతో కిటకిటలాడాయి. అదే విధంగా జాతీయ రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోయాయి.

భూపాలపట్నం-హైదరాబాద్‌ 163వ జాతీయ రహదారి, విజయవాడ-హైదరాబాద్‌ 65వ జాతీయ రహదారితో పాటు హైదరాబాద్‌- కర్నూలు రహదారుల వద్ద ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో వాహనాలు బారులుతీరాయి. టోల్‌ఫ్లాజాల వద్ద కిలో మీటర్లకు పైగా వాహనాలు నిల్చిపో యాయి. ఒక్కో వాహనం టోల్‌ దాటేందుకు అరగంటకు పైగా సమయం పట్టిన పరిస్థితి కనిపించింది. దీంతో రోడ్లపై వాహనాలు నిల్చిపోవడంతో ద్విచక్రవాహన దారులు సైతం తీవ్ర ఇబ్బందిపడ్డారు.

ప్రతీయేటా దసరా పండుగకు నగరంలో నివాసముండేవారు దాదాపు 20లక్షల మంది వరకు తమ సొంతగ్రామాలకు వెళ్లి పండుగ వేడుకల్లో పాల్గొంటారు. ఈ క్రమంలోనే గత నాలుగు రోజులుగా నగర రహాదారులు వెలవెలబోయాయి. తాజాగా మళ్లిd పండుగకు సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి వస్తుండటంతో నగర రహదారులు వాహనాలతో రద్దీగా మారాయి. దీంతో నగరంలోని శివారు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement