Thursday, March 28, 2024

నేటి నుంచి ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో రెసిడెంట్‌ జూనియర్ డాక్టర్లు సమ్మె షురూ చేశారు. విధులు బహిష్కరిస్తున్నారు. ఇప్పటికే స‌మ్మె స‌రైన్ మోగించిన జూడాలు ఈ మేరకు ప్రభుత్వానికి సమ్మె నోటీసు కూడా ఇచ్చారు. ప్రభుత్వంతో రెండు సార్లు చర్చలు జరిపినా విఫలమయ్యాయి. అయితే ఇవాళ మరోసారి చర్చలకు ఆహ్వానించింది ప్రభుత్వం. ఆరోగ్య శాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీతో సమావేశం కానున్నారు జుడాలు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో అత్యవసర కేసులకు మాత్రమే హాజరువనున్నారు. ఇవాళ చర్చల అనంతరం భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నారు జూనియర్ డాక్టర్లు.

అయితే ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం ఈ ఉదయం నుంచి జూనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు సమ్మె లోకి దిగారు. ఆరోగ్య బీమా, ఎక్స్‌గ్రేషియా సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ విధులు బహిష్కరిస్తున్నట్లు వెల్ల‌డించారు తమకు కొవిడ్‌ ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు ఆస్పత్రుల్లో భద్రతా ఏర్పాట్లు పెంచాలని.. స్టయిఫండ్‌లో టీడీఎస్‌ కోత విధించవద్దని జూనియర్ డాక్టర్లు డిమాండ్‌ చేస్తున్నారు. సమ్మెలో భాగంగా ఇవాళ (ఈనెల 9న) కొవిడ్‌తో సంబంధం లేని విధులు, 10వ తేదీన కొవిడ్‌ విధులు, 12 వతేదీన కొవిడ్‌ అత్యవసర విధులను బహిష్కరించాలని నిర్ణయించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారించాల‌ని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement