Thursday, April 25, 2024

తెలుగు రాష్ట్రాల్లో నేడు రేపు వర్షాలు..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలోని కోస్తాలో కొన్ని చోట్ల నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇటు తెలంగాణలో కూడా నేడు, రేపు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనానికి తోడు దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో సముద్ర తీరం వెంబడి గంటకు 55-65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కాబట్టి మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని ఏపీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని పేర్కొంది. ఈ రెండు రోజులు రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది.

అల్పపీడనం ప్రభావంతో తూర్పుగోదావరి, విశాఖపట్టణం, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నిన్న విస్తారంగా వానలు కురిశాయి. కుండపోత వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నిన్న తెలంగాణ వ్యాప్తంగా జోరు వానలు కురిశాయి. పలు జిల్లాల్లో కుండపోత వానలు పడ్డాయి. వర్షాలు విస్తారంగా కురవడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గాలి వానకు పలుచోట్ల చెట్లు విరిగిపడగా, మరికొన్ని చోట్ల కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. పలుచోట్ల రోడ్లు తెగిపోవడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.

ఇది కూడా చదవండి: భార్య ముక్కు కొరికిన భర్త..



Advertisement

తాజా వార్తలు

Advertisement