Wednesday, November 27, 2024

రాజమండ్రి జైలు నుంచి ధూళిపాళ్ల నరేంద్ర విడుదల..

సంగం డెయిరీ కేసులో అరెస్టయిన టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర రాజమండ్రి జైలు నుంచి విడుదల అయ్యారు. ధూళిపాళ్ల నరేంద్రకుమార్ కు బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ధూళిపాళ్ల నరేంద్రతో పాటు సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ కూడా బెయిల్ పై బయటికి వచ్చారు. గుంటూరు జిల్లా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయంటూ ఆ డెయిరీకి చైర్మన్ గా వ్యవహరిస్తున్న ధూళిపాళ్లపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఏప్రిల్ 23న అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణను కూడా అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. జైల్లో ఉండగానే వీరిద్దరూ కరోనా బారినపడ్డారు. వీరి బెయిల్ పిటిషన్లపై హైకోర్టు నిన్న నిర్ణయం తీసుకుంది. షరతులపై బెయిల్ మంజూరు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement