Russian | అంగారా ఎయిర్ లైన్స్ విమానం అదృశ్యం

మాస్కో: సుమారు 50 మంది ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న ర‌ష్యా విమానం(Russian plane) అదృశ్య‌మైంది. ఎయిర్ ట్రాఫిక్ (Air traffic) కంట్రోల్‌తో ఆ విమానం కాంటాక్ట్ కోల్పోయింది. ఏఎన్-24 ప్యాసింజెర్ (An-24 passenger) ప్లాన్ మిస్సైనట్లు అధికారులు చెబుతున్నారు. ఆ విమానంలో సుమారు 50మంది ప్ర‌యాణికులు ఉన్నారు.

తూర్పు ఆముర్ (Amur) ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అంగారా ఎయిర్‌లైన్స్ (Angara airline) ఆ విమానాన్ని ఆప‌రేట్ చేస్తున్న‌ది. చైనా బోర్డ‌ర్ స‌మీపంలో ఉన్న అముర్ ప్రాంతంలోని టిండా ప‌ట్ట‌ణం దిశ‌గా ఆ ప్లేన్ వెళ్తోంది. కొన్ని కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న స‌మ‌యంలో విమానంతో కాంటాక్ట్ కోల్పోయారు.

Leave a Reply