ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడమే గగనం.. ఆపై ఓటర్లందరూ పోలింగు బూత్ లకు (polling booths) కదలివచ్చి ధైర్యంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడం ఒక విచిత్రం…అయితే ఆ రోజులు పోయాయని, అన్ని నియోజకవర్గాల్లాగే అక్కడా ప్రజాస్వామ్య సూరీడు (democracy sun) ఉదయించాడని చెప్పేందుకు సాక్ష్యంగా మారాయి పులివెందుల, ఒంటిమిట్ట (Pulivendula, Ontimitta) జ‌డ్పీటీసీ ఎన్నికలు. ఇంతకాలం ఒక లెక్కా… ఇప్పుడో లెక్కా అని చెప్పకనే చెప్పాయి.

వైఎస్ జగన్ (YS Jagan) తాతగారి హయాం నుంచి వారికి కంచుకోట స్థానాల్లో తెలుగుదేశం (Telugu Desam) పాగా వెయ్యడం ప్రజల్లో మారుతున్న ఆలోచనలకు నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. వైఎసార్సీపీ ప్రాభవం క్రమేపీ కుంచించుకుపోతోందన‌డానికి ఈ ఎన్నికల ఫలితాలే ఒక సంకేతమని స్థానికులు, ఓట్ల సరళిని పరిశీలించిన వారు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికైనా ఆ పార్టీ అధ్యక్షుడు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకుని తప్పులను సరిదిద్దుకుంటే ఏమైనా భవిష్యత్తులో గెలుపు అవకాశాలుండొచ్చు గానీ, ఇంకా ఇలాగే అధికార తెలుగుదేశం, ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) లపైనా, ప్రస్తుత పాలనపైనా నిరాధార ఆరోపణలు చేస్తే ప్రజల నుంచి మరింత వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం పార్టీకి ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయం.

Leave a Reply