- అవార్డులకు ఎంపికైనవి ఎన్నంటే…
భారతీయ సినీ రంగంలో అత్యున్నత గౌరవంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. 2023 సంవత్సరానికి ఈ అవార్డుల 71వ ఎడిషన్‌కు వివిధ విభాగాలలో అవార్డు గ్రహీతల పేర్లను శుక్రవారం ఢిల్లీలో ప్రకటించారు.
జ్యూరీ కమిటీ తన నివేదికను సమాచార, ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్కి సమర్పించింది. కాగా, జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఈసారి కూడా తెలుగు సినిమాలు విశేషంగా రాణించాయి. వరుసగా మూడో ఏడాది తెలుగు చిత్రాలు జాతీయ అవార్డుల్లో దూసుకుపోతుండటం గర్వకారణం. “భగవంత్ కేసరి”, “హనుమాన్”, “బలగం”, “బేబీ” వంటి చిత్రాలు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం పొందాయి.
తెలుగు సినిమాలకు లభించిన అవార్డులు
- ఉత్తమ తెలుగు చిత్రం: భగవంత్ కేసరి
- ఉత్తమ యాక్షన్ డైరెక్షన్: హనుమాన్
- ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: హనుమాన్
- ఉత్తమ గేయ రచయిత: కాసర్ల శ్యామ్ – బలగం (“ఊరు పల్లెటూరు”)
- ఉత్తమ స్క్రీన్‌ప్లే: బేబీ
- ఉత్తమ నేపథ్య గాయకుడు: రోహిత్ – బేబీ
- ఉత్తమ బాలనటి: సుకృతి వేణి – గాంధీతాత చెట్టు
ఉత్తమ నటన విభాగం విజేతలు
- ఉత్తమ నటుడు : షారుఖ్ ఖాన్ – జవాన్, విక్రాంత్ మస్సే – 12th ఫెయిల్
- ఉత్తమ నటి: రాణీ ముఖర్జీ – మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే
- ఉత్తమ తమిళ చిత్రం: పార్కింగ్
- ఉత్తమ హిందీ చిత్రం: కథల్
- ఉత్తమ సంగీత దర్శకుడు: జీవీ ప్రకాష్ కుమార్ – వాతి (సార్)
- ఉత్తమ ఎడిటర్: మిథున్ మురళి – పూక్కాలమ్ (మలయాళం)
- ఉత్తమ సౌండ్ డిజైన్: యానిమల్ (హిందీ)
- ఉత్తమ కథా రచయిత: చిదానంద నాయక్ (కన్నడ)
- ఉత్తమ దర్శకుడు: పీయూష్ ఠాకూర్ – ద ఫస్ట్ ఫిల్మ్ (హిందీ)
- ఉత్తమ షార్ట్ ఫిల్మ్: గిధ్ ది స్కావెంజర్ (హిందీ)
ఉత్తమ నాన్ ఫీచర్ సినిమాలు:
- క్రానికల్ ఆఫ్ ది ప్యాడీ మ్యాన్ (మలయాళం)
- నెకల్ (మలయాళం)
- ది సీ అండ్ సెవెన్ విలేజస్ (ఒడియా)
- ఉత్తమ స్క్రిప్ట్: సన్ ఫ్లవర్స్ వర ది ఫస్ట్ వన్స్ టు నో (కన్నడ)
- ఉత్తమ వాయిస్ ఓవర్: ది సేక్రెడ్ జాక్ – Exploring the Trees of Wishes (ఇంగ్లీష్)
- ఉత్తమ ఎడిటింగ్ (నాన్-ఫీచర్): Moving Focus (ఇంగ్లీష్)
- ఉత్తమ డైరెక్షన్: ద ఫస్ట్ ఫిల్మ్ (హిందీ)
- ఉత్తమ సినిమాటోగ్రఫీ: లిటిల్ వింగ్స్ (తమిళం)